ముగింపు లేని సినిమాతో వస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మొదలు, టీజర్ వరకు ప్రేక్షకులను బాగా అలరించాయి.

కాగా ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ముగింపును చాలా వైవిధ్యంగా తెరకెక్కించాడట దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

నాని విలనా లేక హీరోనా అనే సస్పె్న్స్‌ను రివీల్ చేయకుండానే సినిమాను ముగిస్తారట.

దీంతో ఈ సినిమా సీక్వెల్‌లో ముగింపు లభిస్తుందని తెలుస్తోంది.అంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాలో ముగింపు ఏ విధంగా ఇచ్చారనే అంశం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది… అల్లు అర్జున్ పోస్టు వైరల్!