దుకాణం సర్దేసుకున్న నాని.. ‘వి’ చిత్రం చూసే టైమ్ వచ్చేసింది!
TeluguStop.com
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఈ సినిమాతో మరోసారి నాని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బల్లాక్‌బస్టర్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా పలు ఆఫర్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ముంగిట వాలాయట.
కానీ ఆయన ఈ ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు.దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వాయిదా పడుతూ వస్తోంది.
కాగా ఇప్పట్లో థియేటర్లలో సినిమా రిలీజ్ అసాధ్యం అని అనిపిస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ మక్కువ చూపిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌కు ‘వి’ చిత్ర హక్కులను అమ్మేసినట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కు భారీ మొత్తానికి దిల్ రాజు అమ్మినట్లు, అందుకే ఈ సినిమాను సెప్టెంబర్ తొలి వారంలోనే ప్రేక్షకులకు అందించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే గనక తెలుగు చిత్రాల్లో తొలిసారి ఓ పెద్ద సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?