ఓటీటీ సెంటిమెంట్ కు భయపడుతున్న నాని ఫ్యాన్స్
TeluguStop.com
సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత నాని 25వ చిత్రం ‘వి’ని ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు.
దిల్ రాజు అన్నీ లెక్కలు వేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే ఎక్కువగా వచ్చేసింది.ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఆ తర్వాత థియేటర్ రిలీజ్ కు కూడా ఛాన్స్ ఉంది.
కనుక ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చి ఉంటాయి అంటున్నారు.అయితే నాని ఫ్యాన్స్ మాత్రం ఈ సమయంలో కాస్త ఆందోళనతో ఉన్నారు.
ఈమద్య కాలంలో ఓటీటీలో విడుదల అయిన సినిమాల ఫలితాలే వారి భయానికి కారణం అంటున్నారు.
టాలీవుడ్ నుండి ఓటీటీలో రాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే.నాని ‘వి’ సినిమాకు ఇదో రికార్డుగా నిలవడం ఖాయం.
అయితే టాక్ పరంగా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది అనేది చర్చనీయాంశంగా ఉంది.ఇప్పటి వరకు సౌత్‌లో ఓటీటీ ద్వారా విడుదల అయిన సినిమాల్లో మంచి విజయం సాధించిన సినిమాలు అంటే ఏమీ లేవు.
దాంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ప్రేక్షకుల్లో ముఖ్యంగా నాని అభిమానుల్లో కనిపిస్తోంది.
తెలుగు సినిమాలు ఓటీటీ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సక్సెస్ ను దక్కించుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
నాని 25వ చిత్రం అవ్వడంతో పాటు ఇప్పటికే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ‘వి’ పై సహజంగానే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుంది అనేది మరో రెండు వారాల్లో తెలిసిపోతుంది.
వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆహారాలు వద్దే వద్దు..!