ఏడు నెలలు వెయిట్‌ చేసిన ప్రేక్షకులకు ఫ్లాప్‌ సినిమాలే వెల్‌ కమ్‌ చెప్పబోతున్నాయి

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్ ల ఓపెన్ కు రంగం సిద్ధమవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్లను ఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు వెయిట్ చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్న సమయంలో కొత్త సినిమాలు ఏవి విడుదలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది.

సినీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం కొత్త సినిమాలు ఏమీ కూడా విడుదల అవ్వడం లేదు.

అక్టోబర్ 15న థియేటర్లు ఓపెన్ అయితే రాబోతున్న సినిమాలు ఏంటి అనే విషయం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది.

వి మరియు నిశ్శబ్దం సినిమాలు మాత్రమే ప్రస్తుతం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.అయినా కూడా వాటిని థియేటర్లలో విడుదల చేయాల్సిన పరిస్థితి.

ఎందుకంటే కొత్త సినిమాలు ఏవి కూడా వెంటనే ప్రేక్షకుల ముందుకు రావాలని భావించడం లేదు.

కనీసం వారం రెండు వారాలైనా ఎదురు చూసి అసలు థియేటర్లకు జనాలు వస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు కొత్త సినిమాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది.

పెద్ద సినిమాలు అయితే ఈ ఏడాదిలో అసలు వస్తాయో రావో అని క్లారిటీ కూడా లేదు.

ఇప్పుడు కొత్త సినిమాలు లేకపోవడం వల్ల పాత సినిమాలను ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి.

నిశ్శబ్దం మరియు నాని సినిమాలు నిరాశపరిచాయి.అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు అవే వెల్కం చెప్పబోతున్నాయి.

సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలు అన్ని కూడా వచ్చే సమ్మర్‌ తర్వాత రాబోతున్నాయి.

థియేటర్లు ఓపెన్‌ అయినా కొన్నాళ్ల పాటు డ్రై గానే థియేటర్లు ఉండబోతున్నాయి.

విమానం నుంచి మెట్లు తీసేయడంతో కింద పడిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..