నాని మళ్లీ ఆ తప్పు పని చేసే అవకాశమే లేదు.. అవన్నీ గాలి వార్తలే

కరోనా సెకండ్‌ వేవ్‌ టాలీవుడ్‌ లో మళ్లీ సైలెంట్ ను నింపేసింది.ఈ ఏడాది ఆరంభంలో తెలుగు సినిమా ల జోరు చూసి మునుపటి రోజులు వచ్చాయి అనుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ మొదలు అయ్యింది.

మొదటి వేవ్‌ తో పోల్చితే సెకండ్‌ వేవ్‌ ఎక్కువ కాలం పాటు ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దానికి తోడు ఎక్కువ ప్రభావం కూడా ఉంటుందని కొందరు కామెంట్స్ చేశారు.అందుకే ఇండస్ట్రీ వర్గాల వారు పూర్తిగా థియేటర్లను మూసి వేసి షూటింగ్ లకు కూడా బ్రేక్ వేశారు.

ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా ఉండి పోయారు.ఇక కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా వస్తుంటే కొన్ని సినిమా లను థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు అన్నట్లుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

గత ఏడాది విడుదల ముందు నిలిచి పోయిన వి ను అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఆ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.అదే సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరో లా ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

వి సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడం నాని కెరీర్ లో తప్పుడు నిర్ణయం.

నాని 25వ సినిమా అయిన వి ను అలా విడుదల చేసి తప్పు చేశారు అంటూ అంతా అంటున్నారు.

ఈ సమయంలో నాని నటించిన మరో సినిమా టక్ జగదీష్ ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

"""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాని టక్ జగదీష్‌ సినిమా ఓటీటీ వార్తలు పూర్తిగా అవాస్తవం.

శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌ మరియు టీజర్ చెబుతున్నాయి.

కనుక ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

9 ఉద్యోగాలతో సత్తా చాటిన నల్గొండ శ్రీకాంత్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!