బుల్లితెర మీద హిట్టు కొట్టిన నాని..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా 'టక్ జగదీష్'.

ఆల్రెడీ నిన్ను కోరి సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ ఇది.

అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమా థియేటర్ రిలీజ్ స్కిప్ చేసిన అమేజాన్ ప్రైం లో రిలీజైంది.

సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.పాత కథనే శివ నిర్వాణ అదే పాత స్క్రీన్ ప్లేతో తీయడంతో సినిమా చూసిన ఆడియెన్స్ పెదవి విరిచారు.

అయితే ఈ సినిమా ఓటీటీ లో జస్ట్ ఓకే అనిపించుకోగ ఈమధ్యనే స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది.

విశేషం ఏంటంటే డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆశించిన ఫలితం దక్కించుకోని టక్ జగదీష్ స్మాల్ స్క్రీన్ పై మాత్రం హిట్ అందుకుంది.

సినిమా 10.89 టి.

ఆర్.పి రేటింగ్ తో అదరగొట్టాడు.

డిజిటల్ ఫ్లాట్ ఫాం లో రిజల్ట్ పై నిరాశ పడ్డ నాని స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను టక్ జగదీష్ మెప్పించిందని తెలిసి ఖుషి అవుతున్నాడు.

ఇక త్వరలో నాని శ్యాం సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఆ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?