నాని సినిమాని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
TeluguStop.com
నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ఇన్ని గొడవలైనా కూడా ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపారు.
అంతేకాదు వారు అనుకున్న సెప్టెంబర్ 10న టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ అవుతుంది.
నాని ఎంత ప్రయత్నించినా సరే సినిమాను నిర్మాతలు ఓటీటీ రిలీజ్ చేయక తప్పట్లేదు.
వారికి ఉన్న ఆర్ధిక సమస్యల వల్ల నాని కూడా ఏమి చేయలేని పరిస్థితి అని తెలుస్తుంది.
అయితే నాని టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ ఒప్పుకున్నా సరే ఎక్కడో ఒక చోట ఒక భయం వెంటాడుతుందని తెలుస్తుంది.
నాని నటించిన వి సినిమా ఓటీటీ రిలీజ్ చేశారు.ఆ సినిమా ఫలితం అందరికి తెలిసిందే.
70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే కాని కిక్ ఇవ్వని కొన్ని సినిమాలు సెల్ ఫోన్ లోనో.
టీవీ తెర మీదో చూ స్తే అర్ధం కావు.వి సినిమాలో అదే మిస్ కాలిక్యులేషన్ అయ్యిందని అనుకున్నారు.
అయితే ఇక మీదట ఓటీటీ రిలీజ్ జోలికి వెళ్లకూడదు అనుకున్న నాని టక్ జగదీష్ విషయంలో రాజీ పడక తప్పలేదు.
నిర్మాతల బాగు కోరి నాని ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు ఓకే అన్నాడు.
శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.
సినిమాలో తీరు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ లక్షణాలు ఉన్న ఏకైక హీరో తారక్.. ఏవంటే..?