మరో సారి నాని- మారుతి కాంబినేషన్. ఈ సారి మరిన్ని నవ్వులు

చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత టాలీవుడ్ కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు మారుతి.

మారుతి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే అందులో ఫన్ గ్యారెంటీ అనే టాక్ ముందుగానే వచ్చేస్తుంది.

రిలీజ్ కి ముందే సినిమా మీద పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది.ఇక అతని దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

నాని కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లో అది కూడా ఒకటి.

ఆ సినిమా తర్వాత నాని మరింత బిజీ హీరోగా మారిపోయి స్టార్ హీరోల కేటగిరీలోకి వెళ్ళిపోయాడు.

అతను రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఆ సినిమా తర్వాత వరుస సక్సెస్ లు నాని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం నాని ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమాని పూర్తి చేశాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమాని ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఇదిలా ఉంటే భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి-నాని కలిసి మరో సినిమా చేయాలని భావిస్తున్నారు.

అయితే నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు.

అయితే ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తుంది.తాజాగా మారుతి వినిపించిన కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో మారుతి వున్నట్టు, దీనిని పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నట్టు తెలుస్తోంది.

అన్ని అనుకూలంగా జరిగితే వచ్చే ఏడాది శ్యామ్ సింగరాయ్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.

చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?