నాని సుజీత్ కాంబినేషన్ మూవీ ఆగిపోవడం వెనుక సమస్య ఇదే.. అందుకే ఆగిపోయిందా?
TeluguStop.com
హీరో నాని( Nani ) అలాగే దర్శకుడు సుజిత్( Sujeeth ) కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
నిజంగా ఇది క్రేజీ కాంబినేషన్ అని అందరూ అనుకున్నారు.కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టారు.
దర్శకుడు సుజిత్ హీరో పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కానీ పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల కాస్త గ్యాప్ వచ్చింది.ఈ గ్యాప్ లో నానితో అదే దర్శకుడితో సినిమా చేయాలని దానయ్య అనుకున్నారు.
"""/" /
నానిని మంచి రెమ్యూనిరేషన్ ని కూడా ఆఫర్ చేసారు.అంతా ఓకె అనుకున్నారు.
దాంతో ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం తనకు వున్న రెండు కమిట్ మెంట్ లను కాస్త వెనక్కు నెట్టారు నాని.
దసరా దర్శకుడితో ఒకటి, బలగం వేణుతో మరోటి.కానీ ఈలోగా సుజిత్ కాంబినేషన్ సినిమా లెక్కలు మారాయి.
ఆ సినిమా బడ్జెట్ కు సినిమా మార్కెట్ కు మధ్య పొంతన కుదరడం లేదు.
దానికి తోడు నిర్మాత దానయ్య( D V V Danayya ) సినిమా ఖర్చు విషయంలోనో, కాస్టింగ్ విషయంలోనూ కిందా మీదా కావడం చూసి, ఇక ఇబ్బంది వుండ కూడదని హీరో నాని ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారట.
"""/" /
మరి ఇప్పుడు దసరా దర్శకుడి ప్రాజెక్ట్ ముందుకు తీసుకువస్తారో? బలగం వేణు ప్రాజెక్ట్ ముందుకు తెస్తారో చూడాలి మరి.
ఇకపోతే హీరో నాని విషయానికి వస్తే నాని చివరగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
దీంతో తదుపరి సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు నాని.