రివ్యూ : నాని ‘వి’ ప్రయోగ ఫలితం తేలలేదు

ఏ హీరో కెరీర్‌ లో అయినా 25వ సినిమా అంటే చాలా ప్రత్యేకమైనవి అనడంలో సందేహం లేదు.

అందుకే నాని తన 25వ సినిమాగా ప్రయోగాత్మకంగా విభిన్నంగా ఉండాలని ప్లాన్‌ చేసుకున్నాడు.

తనకు మొదటి సినిమా ఛాన్స్‌ ఇచ్చిన ఇద్రగంటితో ఈ ప్రయోగానికి సిద్దం అయ్యాడు.

ఇలాంటి కథలు కాస్త రిస్క్‌ అని తెలిసి కూడా నాని దర్శకుడిపై నమ్మకంతో ఈ సినిమాను చేసినట్లుగా అనిపించింది.

ఇంతకు ఈ ప్రయోగ ఫలితం ఏంటీ? నాని ఆశించింది దక్కిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

H3 Class=subheader-styleకథ :/h3p ఇదో రొటీన్‌ రెగ్యులర్‌ రివేంజ్‌ డ్రామా.ఇలాంటివి తెలుగు సినిమాల్లో కొన్ని వందల సార్లు చూశాం.

విషయానికి వెళ్తే.వి(నాని) ఒకడిని చంపి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన ఆధిత్య(సుధీర్‌బాబు)కు ఛాలెంజ్‌ చేస్తాడు.

మరో నలుగురిని చంపబోతున్నాను ఆ లోపు పట్టుకో లేదంటే నీ జాబ్‌ కు రాజీనామా చేయాలంటాడు.

అందుకు ఆధిత్య సిద్దం అయ్యి 'వి' ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు.ఇంతకు వి చంపేది ఎవరిని? ఆ హత్యలకు ఆధిత్యకు సంబంధం ఏంటీ అనేది సినిమా కథ """/"/ H3 Class=subheader-styleనటీనటుల నటన /h3p: నాని తనకు ఉన్న సహజ నటుడి ట్యాగ్‌ కు తగ్గట్లుగా నటించాడు.

కిల్లర్‌ పాత్రలో నాని ఆకట్టుకున్నాడు.ప్రతి సీన్‌ లో కూడా అతడి నటన బాగుంది.

ఇక లుక్‌ పరంగా కూడా అతడు ఆకట్టుకున్నాడు.అత్యంత క్రూరమైన సీన్స్‌ సమయంలో కూడా నాని మెప్పించాడు.

ఇక సుధీర్‌ బాబు పోలీస్‌ ఆఫీసర్‌ గా మంచి నటనతో మెప్పించాడు.సిక్స్‌ ప్యాక్‌ చూపించడంతో పాటు తన పాత్ర పరిధిలో ఆకట్టకున్నాడు.

హీరోయిన్స్‌ కేవలం గ్లామర్‌ డాల్స్‌ గానే మిగిలి పోయారు.కాస్త నివేధా థామస్‌ తన మెస్మరైజింగ్‌ నటనతో ఆకట్టుకుంది.

అయితే ఆమెకు కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో కరివేపాకు పాత్ర అయ్యింది.వెన్నెల కిషోర్‌ ఉన్నాడు.

కాని ఆయన నుండి ప్రేక్షకులు ఆశించేది ఏమీ లేదు.అంటే కిషోర్‌ మార్క్‌ అస్సలు కనిపించలేదు.

మిగిలిన వారు సో సో గానే అనిపించారు.h3 Class=subheader-styleటెక్నీషియన్స్‌ పనితీరు :/h3p అమిత్‌ త్రివేది ఇచ్చిన పాటల్లో ఇప్పటికే రెండు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సినిమాలో మాత్రం అవి పెద్దగా ఎఫెక్ట్‌ చూపించలేక పోయాయి.ఇక ఈ సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ను థమన్‌ ఇచ్చాడు.

కొన్ని సీన్స్‌ లో పర్వాలేదు అనిపించినా ఎక్కవ సీన్స్‌ లో పరమ రొటీన్‌గా అనిపించింది.

సినిమాటోగ్రఫీ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఏమీ లేదు.చాలా సింపుల్‌ గా సినిమాటోగ్రఫీ సాగింది.

ఛేజింగ్‌ సీన్స్‌ లో కూడా మెరుపులు ఏమీ కనిపించలేదు.ఎడిటింగ్‌ లోపాలున్నాయి.

కామెడీ కోసం అంటూ పెట్టిన రెండు సీన్స్‌ పరమ బోరింగ్‌ అనిపించాయి.వాటిని పూర్తిగా లేపేస్తే పోయేది.

ఇక దర్శకుడు ఇంద్రగంటి పరమ రొటీన్‌ కథను ఎంపిక చేసుకున్నాడు.అయితే స్క్రీన్‌ ప్లేను కొత్తగా నడిపించి ఉంటే బాగుండేది.

కాని స్క్రీన్‌ ప్లే విషయంలో కూడా ఏమాత్రం కొత్తదనం చూపలేక పోయాడు.నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

H3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p నాని విలన్‌ అంటూ ప్రచారం చేయడంతో సినిమా గురించి ఆసక్తి వ్యక్తం చేశారు.

కాని ప్రేక్షకులను చిత్ర యూనిట్‌ సభ్యులు మోసం చేశారు.సినిమాలో నాని పాత్ర విషయంలో ప్రేక్షకులు చీట్‌ చేశారు అనే ఫీలింగ్‌ రాక మానదు.

అది ఏంటీ అంటే సినిమా చూస్తే అర్థం అవుతుంది.నాని వంటి ఒక మంచి నటుడిని దర్శకుడు బాగానే ఉపయోగించుకున్నాడు.

సుధీర్‌ బాబును కూడా ఇంద్రగంటి బాగా చూపించాడు.కాని వారిద్దరిని కలిపి మంచి స్క్రీన్‌ ప్లేతో ప్రజెంట్‌ చేయడంలో విఫలం అయ్యాడు అనిపిస్తుంది.

సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగా సాగినా చివరకు పేలవంగా సినిమా మారింది.ముఖ్యంగా క్లైమాక్స్‌ లో ట్విస్ట్‌ రివీల్‌ విషయంలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌ గా చూపించి ఉండాల్సింది.

సినిమా మొత్తంను ఒక సస్పెన్స్‌ ను కంటిన్యూ చేయడం జరిగింది.ఆ విషయంలో మాత్రం పర్వాలేదు అనుకోవచ్చు.

జరుగుతున్న హత్యలకు కారణం ఏంటో తెలుసుకోవాలని సినిమాను చివరి వరకు ప్రేక్షకులు చూసేలా దర్శకుడు చేయగలిగాడు.

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ గురించి పూర్తిగా మర్చిపోయాడు.ఇది ఓటీటీలో విడుదల చేయడం మంచిదై అయ్యిందా లేదా అనేది నిర్మాత ఆలోచించుకోవాలి.

తెలుగులో మొదటి పెద్ద సినిమా ఓటీటీ ద్వారా విడుదల అవ్వడంతో అందరు ఆసక్తిగా ఎదురు చూశారు.

హోం థియేటర్ లో మొదటి సారి పెద్ద సినిమా డైరెక్ట్‌ రిలీజ్‌ అయిన సినిమా చూసిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు.

H3 Class=subheader-styleప్లస్‌ పాయింట్స్‌ /h3p: నాని, సుధీర్‌ బాబు, నివేథా థామస్‌, కథలో ట్విస్ట్‌ H3 Class=subheader-styleమైనస్‌ పాయింట్స్‌/h3p : రొటీన్‌ కథ, దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం H3 Class=subheader-styleచివరగా.

/h3p థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, నాని, సుధీర్‌ బాబు కోసం ఒకసారి చూడవచ్చు.h3 Class=subheader-styleరేటింగ్‌ :/h3p 2.

5/5.0 .

బిగ్ బాస్ షో వల్లే నా పేరు నాశనం.. తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు వైరల్!