నాయుడుగారి తాలూకా అంటున్న నాని… కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.

వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నాని తన తదుపరి ప్రాజెక్టు పనులు బిజీగా ఉన్నారు.

నాని ఇటీవల శ్రీకాంత్ ఓదెల( Sreekanth Odela ) దర్శకత్వంలో దసరా సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే మరోసారి శ్రీకాంత్ డైరెక్షన్ లో నాని నటించబోతున్నారు.

"""/" / ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం విభిన్నమైన టైటిల్ ఎంపిక చేశారని తెలుస్తుంది.ఈ సినిమా కోసం నాయుడుగారి తాలూకా( Naidugari Talukaa ) అనే టైటిల్ పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తుంది.

అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

ఈ సినిమాలో నాని సరసన బాలీవుడ్ బ్యూటి శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటు ఈయన జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్లో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నాని కూడా టైర్ 2 హీరోలలో స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

ఎన్టీఆర్ కి అక్కగా స్టార్ హీరోయిన్.. ఇదేం ప్లాన్ ప్రశాంత్?