సూపర్ నాచురల్ పవర్స్ తో సాయి పల్లవి..!

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చినట్టే.

ఆమె నటనతోనే కాదు డ్యాన్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది.ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాతో వస్తున్న సాయి పల్లవి నాని హీరోగా వస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.

సినిమాలో సాయి పల్లవికి సూపర్ నాచురల్ పవర్స్ ఉంటాయని టాక్.టాక్సీవాల ఫేం రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది.

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవితో పాటుగా ఉప్పెన భామ కృతి శెట్టి కూడా నటిస్తుందని తెలుస్తుంది.

నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా తర్వాత శ్యాం సింగ రాయ్ రిలీజ్ అవుతుంది.

వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో నాని హీరోగా అంటే సుందరానికీ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా నటిస్తుంది.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌