అఫిషియల్‌.. నాని ఫస్ట్‌ పాన్ ఇండియా మూవీ

ఈమద్య కాలంలో హీరోలు అంతా కూడా పాన్ ఇండియా మూవీస్ అంటూ ఉన్నారు.

చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అంతా కూడా మాది పాన్ ఇండియా సినిమా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాల అర్థాలు కొందరు మార్చేస్తున్నారు.తెలుగు లో ఏదో చిన్న బడ్జెట్ తో నిర్మించి కంటెంట్‌ బాగా లేకున్నా కూడా పాన్ ఇండియాలో విడుదల చేయాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న మేకర్స్‌ కొందరు ఉన్నారు.

వారి విషయం పక్కన పెడితే నాచురల్‌ స్టార్‌ నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్ ను సౌత్‌ లోని అన్ని భాషల్లో విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది.అధికారికంగా నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా నాని టీమ్‌ ప్రకటించింది.

నాని ఈ సినిమాలో ఒక విభిన్నమైన గెటప్‌ లో కనిపించబోతున్నాడు.సాయి పల్లవి కూడా ఈ సినిమా స్థాయిని పెంచేందుకు ఆకట్టుకునే పాత్ర చేసిందని తెలుస్తోంది.

సాయి పల్లవి అంటే తమిళం మరియు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది.అందుకే అక్కడ కూడా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

"""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్యామ్‌ సింగరాయ్ సినిమా లో నాని పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ ను కలిగి ఉంటుందట.

డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్బంగా నాలుగు భాషల్లో ఒకే సారి విడుదల కాబోతున్న ఈ సినిమా కు నాలుగు భాషల్లో కూడా ఒకే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహించాడు.

కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందట.

చరణ్ కు సినిమా హిట్ అయిన రాని సంతోషం అది సక్సెస్ అయితే వస్తుందా?