మరింత భారంగా మారుతున్న నాని శ్యామ్ సింగరాయ్
TeluguStop.com
నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.
ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో మొదట ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టి వదిలేసింది.
నానితో అంత బడ్జెట్ వర్కౌట్ అయ్యేనా ఈ దర్శకుడు అంత బడ్జెట్ ను రికవరీ చేయగలడా అంటూ వారు అనుమానాలు వ్యక్తం చేసి ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఈ సినిమా ను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో మొదటి నుండి చర్చ జరుగుతూనే ఉంది.కరోనా కారణంగా షూటింగ్ ఆగుతూ సాగుతూ వస్తుంది.
దాంతో బడ్జెట్ దాదాపుగా పది కోట్లు పెరిగి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈ సినిమా కోసం వేసిన దాదాపు ఆరు కోట్ల సెట్ వర్షార్పనం అయ్యింది.
ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఈ సినిమా సెట్ట్ సగానికి పైగా స్వంసం అయ్యిందట.
దాంతో మరో మూడు నాలుగు కోట్లు పెట్టి ఆ సెట్టింగ్ ను వేయించాల్సి రావచ్చు అంటున్నారు.
దాంతో ఈ సినిమా బడ్జెట్ మరీ అధికంగా మారుతుందని అంటున్నారు.పెద్ద ఎత్తున ఈ సినిమా బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో బిజినెస్ ఎలా ఉంటుందో అనే ఆందోళన కొందరిని వేదిస్తుంది.
నాని కెరీర్ లో బిగ్గెస్ట్ అంటే 50 కోట్లు.అంతకు మించి అంటే ఈ సినిమా అద్బుతమైన అయ్యి ఉండాలి లేదంటే లక్ అయినా కలిసి రావాలి.
ప్రయోగాత్మకంగా నాని చేస్తున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తి గా చూస్తున్నారు.
నాని కి ఇది చాలా ప్రతిష్టాత్మకం.గత ఏడాది ఈయన నటించిన వి సినిమా నిరాశ పర్చింది.
అందుకే ఈ సినిమా తో మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి రావాలని నాని ఆశ పడుతున్నాడు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!