టాలీవుడ్ లో నాని.. కోలీవుడ్ లో శివకార్తికేయన్.. కథల ఎంపికలో ఈ హీరోలు వేరే లెవెల్!
TeluguStop.com
ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమాకు అద్భుతమైన కథ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే మంచి కథలను ఎంచుకునే ప్రతిభ అందరు హీరోలకు ఉండదు.అందువల్లే కొంతమంది హీరోల సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండగా మరి కొందరు హీరోల సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవడం లేదు.
నాని ( Nani ) గత మూడు సినిమాలను పరిశీలిస్తే దసరా,( Dasara ) హాయ్ నాన్న,( Hi Nanna ) సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) భిన్నమైన సినిమాలు అనే సంగతి తెలిసిందే.
ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించాయి.నాని పాత్రలకు సంబంధించి చూపిస్తున్న వైవిధ్యం విషయంలో సైతం మంచి మార్కులు పడుతున్నాయి.
కెరీర్ తొలినాళ్లలో చిన్న సినిమాలలో నటించిన నాని అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.
"""/" /
నాని సినిమాలు సులువుగానే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని ఏరియాలలో మంచి కలెక్షన్లను సాధిస్తున్నాయి.
నాని సినిమాల డిజిటల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.సినిమా సినిమాకు నాని క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
తమిళంలో శివ కార్తికేయన్( Shiva Karthikeyan ) సైతం అంచెలంచెలుగా ఎదిగి మార్కెట్ పెంచుకున్నారు.
"""/" /
అమరన్ సినిమా( Amaran ) రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
నాని సినిమాలు ఇతర భాషల్లో అదరగొడుతుండగా శివ కార్తికేయన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి.
నాని, శివ కార్తికేయన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
నాని, శివ కార్తికేయన్ పక్కింటి అబ్బాయిలలా సినిమాలలో కనిపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఈ హీరోలకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఐఫోన్ వాడుతున్నారా.. మీరు మోసపోతున్నట్లే.. షాకింగ్ నిజం బయటపెట్టిన మహిళ!