అవార్డ్స్ విషయంలో ఇప్పుడు నాకు ఆ ఆసక్తి లేదు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

నాని నటించిన దసరా సినిమా( Dussehra Movie )కు ఎక్కువ సంఖ్యలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ( Filmfare Awards )వచ్చాయి.

అయితే అవార్డ్స్ గురించి నాని చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవార్డుల విషయంలో ఇప్పుడు నాకు ఆసక్తి లేదంటూ నాని ఒకింత షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టేజ్ పై అవార్డులను అందుకుంటున్న నటీనటులను చూసిన సమయంలో ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక నాలో బలంగా ఉండేదని చెప్పుకొచ్చారు.

అయితే క్రమంగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చిందని నాని పేర్కొన్నారు.అవార్డులపై ప్రస్తుతం అంత ఆసక్తి లేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం నా కోరిక ఏంటంటే నా సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్, యాక్టర్స్( Director, Producer, Technicians, Actors ) తో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నటీనటులు అవార్డ్స్ తీసుకుంటే అందరితో కలిసి చూడాలని నేను ఫీలవుతున్నానని ఆయన అన్నారు.

"""/" / ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డ్ గురించి కాదని ఆయన తెలిపారు.

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ అవార్డులు అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని వాటిని నేను అందజేయడం నాకు సంతోషాన్ని కలిగిస్తోందని నాని చెప్పుకొచ్చారు.

2023 సంవత్సరం నాకెంతో ప్రత్యేకమైనదని థాంక్యూ సో మచ్ అని నాని కామెంట్లు చేయడం గమనార్హం.

"""/" / న్యాచురల్ స్టార్ నాని పారితోషికం కూడా ప్రస్తుతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

నాని ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.సరిపోదా శనివారం సినిమాతో నాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

బాలయ్య సినిమాను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…బాలయ్య క్రేజ్ మామూలుగా లేదుగా…