న్యాచురల్ స్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట.. ఎవరో తెలిస్తే ఒకింత షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో నాని( Tollywood Hero Nani ) సినిమాలలో నటించడం మాత్రమే కాదు తన సినిమానుపేక్షకులలోకి తీసుకెళ్లడానికి విన్నూత్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ప్రమోషన్స్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ ఉంటారు.ఈ విషయంలో హీరో నాని కి నాని సాటి అని చెప్పాలి.

ఇకపోతే హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3( Hit 3 ).

గతంలో విడుదల అయిన సినిమాలకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో అనగా మే 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

"""/" / ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడపుతున్నారు హీరో నాని.

ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.

తనకు ఇష్టమైన హీరోయిన్‌ గురించి తెలిపారు.నాకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం.

ఆమెను ఆరాధించాను.క్షణ క్షణం సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.

లక్షల సార్లు చూడగలిగిన చిత్రమది.ఆమె అంత అందంగా ఎలా ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఆ సినిమాకే శ్రీదేవి అందాన్ని తెచ్చారు అని తెలిపారు. """/" / అలాగే తన ఫేవరెట్ హీరోయిన్ కూడా శ్రీదేవి( Sridevi ) అని చెప్పుకొచ్చారు నాని.

ఈ సందర్భంగా నానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే నాని హిట్3 విషయానికి వస్తే.ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు.అలాగే సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నాని.

ఈ సినిమాలో నాని నటించిన తో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడం దానికి చాలా ముఖ్యం.