పోతారు మొత్తం పోతారు.. సరిపోదా శనివారం మూవీ ట్విట్టర్ రివ్యూ అదిరిపోయిందిగా!

నాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) మూవీ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలైంది.

దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత నాని నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ మూవీ రెండో మూవీ కాగా ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పూర్తయ్యాయి.

నెటిజన్లు, నాని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది.

సినిమాలో శనివారం కాన్సెప్ట్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నాని ఇంట్రడక్షన్ అదిరిపోయిందని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగున్నాయని నాని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జేక్స్ బిజాయ్ మ్యూజిక్, బీజీఎంతో ఊహించని స్థాయిలో మెప్పించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. """/" / ప్రధానంగా నాని, ఎస్జే సూర్య( SJ Surya ) కాంబో సీన్స్ కు అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని సీన్స్ లో నానిని డామినేట్ చేసేలా ఎస్జే సూర్య యాక్టింగ్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇన్నోసెంట్ లుక్స్ తో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) మెస్మరైజ్ చేసిందని ట్విట్టర్ రివ్యూలో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. """/" / సినిమా బాగానే ఉన్నా కొన్ని చిన్న చిన్న మైనస్ లు మాత్రం ఉన్నాయి.

నిడివి ఎక్కువగా ఉండటం, క్లైమాక్స్ ఫైట్ మరీ ప్రేక్షకుల అంచనాలను మించే రేంజ్ లో లేకపోవడం, కథ కథనం ఊహించే విధంగా సాగడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.

మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ పెరిగేది.ఆగష్టు చివరి వారంలో నాని ఖాతాలో మరో హిట్ చేరిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

పోతారు సినిమాకు ఫ్యామిలీ మొత్తం పోతారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పోతారు మొత్తం పోతారు.. సరిపోదా శనివారం మూవీ ట్విట్టర్ రివ్యూ అదిరిపోయిందిగా!