సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ.. నాని శివ తాండవం మామూలుగా లేదుగా!
TeluguStop.com
న్యాచురల్ స్టార్ నాని( Nani ) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ నెల 29వ తేదీన నాని హీరోగా వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.నాని బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాల్లో సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
ట్రైలర్ లో( Trailer ) నాని శివ తాండవం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వారంలో ఎప్పుడు కోపం వచ్చినా తల్లికి ఇచ్చిన మాట కోసం శనివారం మాత్రమే సూర్య(నాని) కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఇతరుల సమస్యలు విని కోపం వస్తే సూర్య ఆ సమస్యను తన భుజాలపై వేసుకొని పరిష్కరిస్తూ ఉంటాడు.
అలాంటి సూర్యకు ఒక సందర్భంలో సీఐతో తలపడాల్సి వస్తుంది.ముసుగు వేసుకుని ప్రతి శనివారం సూర్య సీఐకి చుక్కలు చూపిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత కథలో ట్విస్టులు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కింది.
"""/" /
ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Arul Mohan ) ఈ సినిమాలో హీరోయిన్ కాగా ఆమె ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.ట్రైలర్ లో ఎస్జే సూర్య( SJ Surya ) పర్ఫామెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
నాని ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది.
నానికి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. """/" /
న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.
నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా నాని సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్లానింగ్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?