లిప్ లాక్ సీన్లో నటించినందుకు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది… నాని కామెంట్స్ వైరల్!
TeluguStop.com
నాచురల్ స్టార్ నాని ( Nani ) హీరోగా నటించినటువంటి తాజా చిత్రం హాయ్ నాన్న( Hi Nanna )ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసినటువంటి పాటలు పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా టీజర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"""/" /
ఇక ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఒక విలేఖరి నాని( Nani ) ని వింత ప్రశ్న వేశారు ఈ సినిమా టీజర్ కనుక చూస్తే నాని కూడా లిప్ లాక్( Lip Lock ) సినిమాలో నటించారని తెలుస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఇలాంటి సీన్లు ఉండటం సర్వసాధారణంగా మారింది.
అయితే కొంతమంది సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి సీన్స్ యాడ్ చేయక మరికొందరు మాత్రం కథ డిమాండ్ చేయడంతోనే ఇలాంటి సీన్లలో నటిస్తూ ఉంటారు.
హాయ్ నాన్న సినిమాలో కూడా నాని ఇలాంటి పాత్రలో నటించారని తెలుస్తోంది ఇదే విషయం గురించి విలేకరి నానిని ప్రశ్నించారు.
"""/" /
మీరు నటిస్తున్నటువంటి ప్రతి సినిమాలోను ఇలాంటి లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అయితే దర్శకుడు ఇలాంటి సీన్లను పెడతారా లేకపోతే మీరే పెట్టాలని కండిషన్స్ పెడతారా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నేను సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి సీన్స్ చేయను అయితే కథ డిమాండ్ చేస్తే తప్ప ఇలాంటి పాత్రలలో తాను నటించనని ఇలాంటి లిప్ లాక్ సన్నివేశాలలో( Liplock Scenes ) నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయని నాని తెలిపారు.
అయితే నేనొక నటుడుని కథ డిమాండ్ చేసినప్పుడు అన్ని సీన్లలో నటించాల్సిన బాధ్యత నాకుంది అంటూ ఈయన తెలియజేశారు.
మరి ఇప్పుడు కూడా మీ ఇంట్లో గొడవ జరుగుతుందా అంటూ మరో విలేకరి ప్రశ్నించగా ఏమో ఇప్పుడే కదా టీజర్ లాంచ్ అయింది ఇంటికి వెళ్తే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను అంటూ నాని సరదాగా చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!