ఇంద్రగంటి సినిమా కోసం విలన్ అవతారం ఎత్తిన నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉన్నాడు.

చివరి రెండు చిత్రాలు ఫ్లాప్ అయిన కూడా ఎ మాత్రం స్పీడ్ తగ్గించకుండా వరుస సినిమాలు సైన్ చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఇప్పటి వరకు రెగ్యులర్ జోనర్ లో పక్కింటి కుర్రాడు తరహా పాత్రలు చేసిన నాని కొత్త సినిమాలతో డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాడు.

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న జెర్సీ సినిమా క్రికెట్ నేపధ్యంలో పీరియాడికల్ డ్రామాగా వస్తుంది.

ఇందులో ఓడిన ఆది గెలిచినా క్రికెటర్ గా నాని కనిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే జెర్సీ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని గ్యాంగ్ లీడర్ గా వస్తున్నాడు.

ఈ సినిమాలో ఐదు మంది లేడీస్ తో రాబరీలు చేయించే దొంగగా నాని కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే దీంతో పాటు మరో సినిమాని నాని సెట్స్ పైకి తీసులేతున్నాడు.

అది ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో అయితే ఈ సినిమాలో నాని చేస్తున్న పాత్ర విలనీ అని తెలుస్తుంది.

గతంలో జెంటిల్మన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో విలన్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది.

ఇందులో హీరోగా సుదీర్ బాబు నటిస్తాడని సమాచారం.

కామాఖ్య దేవాలయంలో పూజలు చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్.. కారణాలివేనా?