నాని టికెట్ల రేట్ల వ్యాఖ్యల వివాదం మళ్లీ మొదటికి

ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉన్న సమయంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్థావనకు వస్తున్నాయి.

ఎందుకంటే థియేటర్లకు జనాలు క్యూ కట్టడం లేదు.కారణం ఏంటీ అంటే వందలకు వందల టికెట్ల రేట్లు ఉంటే థియేటర్‌ కు వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది.

మూడు నాలుగు వారాలు ఆగి లేదా ఇంకా ఎన్ని రోజులు అయినా ఆగి ఓటీటీ లో చూస్తాం.

అది కాదంటే టీవీలో చూస్తాం.అంతే తప్ప అప్పులు చేసి వేల రూపాయలు ఖర్చు చేసి సినిమా లను చూసే పరిస్థితి లేదు అంటున్నారు.

దాంతో టికెట్ల అమ్మకాలు దారుణంగా ఉన్నాయి.పెద్ద హీరోల సినిమాలు మరియు చిన్న హీరోల సినిమాలు ఇలా ప్రతి ఒక్క సినిమా కు కూడా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

మళ్లీ సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలంటే టికెట్ల రేట్లు తగ్గాలి అంటూ ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.

అప్పుడు నాని ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉన్న సమయంలో కిరాణ షాపు గల్ల పెట్టి వసూళ్లు థియేటర్‌ గల్ల పెట్టే కంటే ఎక్కువ వస్తున్నాయి.

అప్పుడు ప్రేక్షకులను అవమానించినట్లు కాదా అంటూ ప్రభుత్వంను ప్రశ్నించాడు. """/"/ టికెట్ల రేట్లు పెంచారు.

ఇప్పుడు ఆయన సినిమా అంటే సుందరానికి థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అయ్యింది.

దాంతో మళ్లీ ఆయన టికెట్ల రేట్ల పై చేసిన వ్యాఖ్యలను కొందరు తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన టికెట్ల రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన సినిమాకు రాబోతున్న వసూళ్లను పోల్చుతూ వ్యాఖ్యలు చేసేందుకు విమర్శలు చేసేందుకు కొందరు ఎదురు చూస్తున్నారు.

కనుక నాని వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చేయనుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ.. దేవర మూవీ విషయంలో తప్పు అక్కడే జరుగుతోందా?