‘హాయ్ నాన్న’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్.. పోస్టర్ అదిరింది!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) సినిమా వస్తుంది అంటేనే ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు.

అసలు నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎదురు చూస్తారు.

ఇటీవలే దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను నాని చూపించాడు.ఇక ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలానే లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

లవ్ స్టోరీతో పాటు తండ్రి, కూతురు సెంటిమెంట్ ను కూడా చూపించి ఆడియెన్స్ మనసు దోచేందుకు రెడీ అయ్యాడు.

నాని ప్రస్తుతం ''హాయ్ నాన్న''( Hi Nanna ) చేస్తున్నాడు.ఇది తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది.

ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

"""/"/ ఇక ఇప్పుడు ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేస్తూ మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.

ప్రతీ అప్డేట్ తో పాటు డిఫరెంట్ ప్రమోషన్స్ తో కూడా ఆకట్టు కుంటున్న ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

"""/"/ కాగా ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషిస్తుండగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?