నాలుగు కోట్ల కోసమే అలా అంటూ నానిపై సంచలన ఆరోపణలు!
TeluguStop.com
టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అష్టా చమ్మా సినిమాతో తొలిసారిగా పరిచయమైన నాని ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదా ను అందుకున్నాడు.
ఇదిలా ఉంటే హీరో నాని నాలుగు కోట్ల కోసం అలా అన్నాడంటూ ఆయనపై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
"""/"/
దేశంలో కోవిడ్ కారణంగా థియేటర్ల మీద ప్రభావం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.
ఇదిలా ఉంటే చాలామంది హీరోలు తమ సినిమాలను ఓటీటీ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ ఈవెంట్ లో హీరో నాని సినిమా థియేటర్ ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
సినిమా థియేటర్లపై టికెట్ రేట్ల గురించి స్పందించడమే కాకుండా థియేటర్ల పరిస్థితి బాగా దిగజారిందని అందుకు థియేటర్ లోనే సినిమాలు విడుదల చేయాలని అన్నాడు.
ఇక ఏ స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ లో విడుదలయ్యే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా పోరాడుతానని వ్యాఖ్యలు చేయగా.
ఇలా వ్యాఖ్యలు చేసిన వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట.నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓ టి టి లో రిలీజ్ చేయాలని అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నాడట.
అది కూడా ఆయన థియేటర్ ల గురించి మాట్లాడిన రోజే అమెజాన్ తో ఒప్పందం చేసుకోగా.
అక్కడ నాలుగు కోట్ల తేడాతో వారి మధ్య కాస్త వాగ్వాదం జరిగిందని తెలిసింది.
"""/"/
అందుకు నాని వేదికపైకి వచ్చి థియేటర్ల గురించి అలా మాట్లాడాడని తెలిసింది.
ఆ తర్వాత అమెజాన్ నాని సినిమాకు నాలుగు కోట్లు ఇవ్వడానికి ముందుకు రాగా ఈ విషయం గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ అనుకున్నట్లే నాని సినిమా థియేటర్లో కాకుండా అమెజాన్ లో విడుదల చేస్తే మాత్రం నానికి విమర్శలు తప్పవని తెలుస్తోంది.
ఎండ దెబ్బకు తల తిరుగుతుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!