‘దసరా’ సినిమా పాన్ ఇండియా లెక్కలు.. ఇంతకు నాని స్టామినా ఎంత?

నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వం లో రూపొందిన దసరా సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుండి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

ఆ మధ్య నాని చేసిన వ్యాఖ్యలతో ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అనే అభిప్రాయం ఏర్పడింది.

పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా ను విడుదల చేసే ఉద్దేశం తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో నాని(Nani) మార్కెట్ సాలిడ్ గా ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఇతర భాషల్లో నాని సినిమాలు పెద్దగా ఆడలేదు.

కనుక అక్కడ దసరా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ రైట్స్ ద్వారా రూ.

30 కోట్ల లను దక్కించుకునే అవకాశం ఉంది. """/" / ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయలను రాబట్టాలని టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

ట్రైలర్ అద్భుతంగా ఉండి ప్రమోషన్ కార్యక్రమాలు సాలిడ్ గా చేస్తే కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల రూపాయలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

నాని స్టామినా ఎంత అనే విషయం పక్కన పెడితే సినిమా పబ్లిసిటీ చేయడం ద్వారా ఎంత వరకు సద్వినియోగం అవుతుంది అనేది ఇప్పుడు చర్చ.

కంటెంట్ బాగుంటే నాని ఈజీ గా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రాబట్టగలడు.

హీరో స్టామినా తో పని లేకుండా ఈ మధ్య కాలంలో సినిమాల కంటెంట్ ప్రేక్షకులను థియేటర్ల కు రప్పిస్తున్నాయి.

"""/" / కనుక దసరా(Dasara) సినిమా కంటెంట్ బాగుంటే కచ్చితంగా 100 కోట్ల సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొదటి నుండి కూడా నాని ఈ సినిమా అద్భుతం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాడు కనుక కచ్చితంగా పాన్ ఇండియా లెవల్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

మార్చి 30వ తారీకున ఈ సినిమా విడుదల కాబోతుంది.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.

లాంగ్ అండ్ షైనీ హెయిర్ ను కోరుకుంటున్నారా.. అయితే ఈ టానిక్ ను వాడండి!