ఆ పనైన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్న నాని… మరింత జోష్‌ తో పబ్లిసిటీ

ఆ పనైన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్న నాని… మరింత జోష్‌ తో పబ్లిసిటీ

నాచురల్ స్టార్‌ నాని హీరోగా కీర్తి సురేష్‌( Keerthy Suresh ) హీరోయిన్ గా శ్రీకాంత్‌ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా ను ఈనెల 30వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ పనైన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్న నాని… మరింత జోష్‌ తో పబ్లిసిటీ

పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నాని మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం.

ఆ పనైన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్న నాని… మరింత జోష్‌ తో పబ్లిసిటీ

భారీ ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.నిన్న మొన్నటి వరకు ప్రమోషన్ విషయంలో పెదవి విరిచిన వారు కూడా నాని టీమ్ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నారు.

ఈ సమయంలో సినిమా మరో అడుగు ముందుకు వేసింది.దసరా( Dussehra ) సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

నాని పాత్ర విషయంలో సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్స్ చాలా పాజిటివ్‌ గా కామెంట్స్ చేశారట.

అంతే కాకుండా పెద్దగా కట్స్‌ పెట్టకుండా కొన్ని డైలాగ్స్ విషయంలో మ్యూట్‌ పెట్టారట.

విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

"""/" / అద్భుతమైన దసరా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకాన్ని నాని వ్యక్తం చేస్తున్నాడు.

కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కాంతార ( Kantara )సినిమాను ఎలా అయితే అభిమానించారో అదే విధంగా ఈ సినిమాను కూడా అభిమానిస్తారని నమ్మకం వ్యక్తం అవుతోంది.

సోషల్‌ మీడియాలో దసరా సినిమాకు మరింత స్పీడ్ పెంచి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు పీఆర్‌ టీం ప్లాన్‌ చేస్తోంది.

నాని మరియు కీర్తి సురేష్ ల యొక్క నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ ఉన్నారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దసరా సినిమా ఉంటుందా అనే అనుమానం కొందరిలో ఉంది.

కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

అంబానీ వంతారాలో మోదీ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే.. సింహాల పిల్లలతో ఇంత చనువుగానా?