అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన నాని చిత్రం
TeluguStop.com
నేచురల్ స్టార్ నాని నటించే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.
ఆయన ఎంచుకునే కథలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుండటంతో వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాలను అందుకుంటున్నాయి.
ఈ క్రమంలో నాని నటించిన జెర్సీ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం.
నాని ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టడంతో జెర్సీ సినిమా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
అయితే ఈ సినిమా ఒకచోట మాత్రం అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది.ఈ సినిమాను ఇటీవల కన్నడలో డబ్ చేసి బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు.
అయితే ఈ సినిమాకు దారుణమైన విధంగా 2.3 టీఆర్పీ మాత్రమే వచ్చింది.
ఇలాంటి హిట్ మూవీకి ఇంత తక్కువ టీఆర్పీ రావడం నిజంగా షాకింగ్ కలిగించే విషయం అని నాని ఫ్యాన్స్ అంటున్నారు.
గౌతమ్ తిన్నూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నా, ఇలా బుల్లితెరపై అట్టర్‌ఫ్లాప్‌గా నిలవడం నిజంగా ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.
ఇక ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా, పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు చిత్ర యూనిట్.
మరి ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
కాగా ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్8, మంగళవారం 2025