నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న జెర్సీ మూవీ

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ.

ఎమోషనల్ డ్రామాగా తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నాని నటనకి అందరూ ఫిదా అయిపోయారు.

కొడుకు కోసం వదిలేసిన క్రికెట్ ని మళ్ళీ ఆడి అతనికి ఇండియన్ జెర్సీని గిఫ్ట్ ఇవ్వడంతోనే ఈ కథ ముగుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిన మంచి గుర్తింపు మాత్రం తెచ్చుకుంటుంది.

ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ అవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం అవార్డుని ఈ సినిమా సొంతం చేసుకుంది."""/"/ కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లుగా ఆయన పేరుతో చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించిన వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

2019 సంబంధించిన అవార్డులు 2020లో ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది.అయితే ఈ సారి కరోనా కారణంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది.

తాజాగా ప్రభుత్వం అవార్డుల జాబితాని ప్రకటించింది.దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ తెలుగు కేటగిరిలో 2019కి సంబంధించి ఉత్తమ చిత్రంగా జెర్సీ మూవీ అవార్డుని కైవసం చేసుకుంది.

అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటనకి గాను ఉత్తమ నటుడు అవార్డుని నవీన్ పోలిశెట్టి సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ అవార్డుల జాబితాలో అల వైకుంఠపురంలో పాటలకి గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా థమన్ కేంద్ర ప్రభుత్వ అవార్డుని కైవసం చేసుకున్నాడు.

త్వరలో ఈ అవార్డుల ఫంక్షన్ ఏర్పాటు చేసి అధికారికంగా ఇవ్వనున్నారు.

షర్మిల ఓడిపోతుందని బాధపడుతున్న జగన్