పవన్ నే నమ్ముకుంటున్న ఏపీ మంత్రి ? 

పవన్ నే నమ్ముకుంటున్న ఏపీ మంత్రి ? 

జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది.ఇక ఆ పార్టీ సంస్థాగతంగా పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకోలేదు.

పవన్ నే నమ్ముకుంటున్న ఏపీ మంత్రి ? 

అసలు 2024 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత అనేది పూర్తి స్థాయిలో అంచనా వేయలేని పరిస్థితి.

పవన్ నే నమ్ముకుంటున్న ఏపీ మంత్రి ? 

అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం జనసేన పేరు మారుమోగుతూనే ఉంది.ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, పవన్ కు కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇదిలా ఉంటే తరచుగా ఏపీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే  ఉన్నారు.

పవన్ ఏ విషయంపైనా విమర్శించేందుకు పేర్ని నాని ముందుంటున్నారు.సినిమా కు సంబంధించిన అంశాల్లోనూ పవన్ ను టార్గెట్ చేసుకుంటూ నాని విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇదంతా క్రెడిట్ సాధించేందుకు నాని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే పవన్ ను టార్గెట్ చేయడం ద్వారా మరింత క్రెడిట్ తనకు వస్తుందని నాని నమ్ముతున్నారని, జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు.

  """/"/ సినీ పరిశ్రమకు సంబంధించి నాని ఎన్నో విమర్శలు చేశారు.ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ హీరోలందరి పేర్లను ప్రస్తావించిన నాని వారి కంటే పవన్ కళ్యాణ్ స్థాయి తక్కువ అన్నట్లుగా విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ సినిమాలకంటే అల్లు అర్జున్ సినిమాల కి ఎక్కువగా కలెక్షన్లు వస్తాయని , చిరంజీవి, ఎన్టీఆర్,  మహేష్ ప్రభాస్ , రామ్ చరణ్ సినిమాల కంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తక్కువగా ఆడతాయని, అత్తారింటికి దారేది తర్వాత పవన్ కు సరైన హిట్ లేదు అంటూ నాని విమర్శలు చేశారు.

ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా జనసైనికులు నాని ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండటం,  దీనికి కౌంటర్ గా వైసీపీ విమర్శలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలతో జగన్ టీమ్ లో మంత్రి పేర్ని నాని పేరు కూడా మారుమోగుతోంది.

పవన్ కు ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం ద్వారా తన పరపతి జగన్ వద్ద పెంచుకునేందుకు  ఉపయోగపడుతుందని నాని నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు.

రాజమౌళి స్థాయిని తగ్గించేలా నీచమైన ఆరోపణలు.. మరీ ఇంత దారుణమా?