బడే మీయాన్.. చోటే మీయాన్ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాని?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరగడంతో చిత్ర బృందం మొత్తం హైదరాబాద్లో సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ప్రాజెక్టుకే చిత్ర బృందానికి ప్రభాస్ పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం చిత్ర బృందానికి పార్టీ ఇచ్చారు.ఈ పార్టీలో భాగంగా చిత్ర బృందంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు హాజరయ్యారు.

వీరిలో నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.ఇక ఈ పార్టీలో భాగంగా నాచురల్ స్టార్ నాని బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కలిసి ఆయనతో ఫోటోలు దిగారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇది జరిగిపోయింది.బడే మీయాన్.

చోటే మీయాన్ ' అంటూ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు.అమితాబచ్చన్ సైతం ప్రాజెక్టు కే చిత్ర బృందాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే ఈ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్రరావుని లెజెండ్ అంటూ సంబోధించారు.

"""/"/ ప్రభాస్ బాహుబలి, నాని ఓ స్టార్.దుల్కర్ సల్మాన్ ఓ స్టార్ అంటూ అందరి గురించి చెబుతూ ట్వీట్ చేశాడు.

అమితాబ్ ట్వీట్ పై నాచురల్ స్టార్ నాని స్పందిస్తూ.మోస్ట్ మెమరబుల్ సర్.

ఫ్యాన్ మూమెంట్ అంటూ రెడ్ హార్ట్ సింబల్ ఇచ్చారు.ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ప్రాజెక్టుకే సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఝార్ఖండ్ లో ఈడీ సోదాలు.. భారీగా నగదు పట్టివేత