అలాంటి బయోపిక్ సినిమాలో నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన నాని!

నాచురల్ స్టార్ నాని( Nani ) త్వరలోనే సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టిన నాని అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

"""/" / ఈ సినిమా ఆగస్టు 29 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా రిపోర్టర్స్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేయగ నాని చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు మరి మీరు పోలీస్ ఆఫీసర్( Police Officer Role ) పాత్రలో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

"""/" / ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ ఈ సినిమా విడుదల అయిన తర్వాత నేను చేయబోయే తరువాత సినిమాలో నన్ను పోలీస్ ఆఫీసర్ గా చూస్తారని ఈయన వెల్లడించారు.

ఇక ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ గురించి బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ క్రమంలోనే మీరు కూడా బయోపిక్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ తనకు ఫ్రీడమ్ ఫైటర్స్( Freedom Fighters ) బయోపిక్ సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.

అలా ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ కథతో ఎవరైనా తన వద్దకు వస్తే చాలా హ్యాపీ అంటూ నాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మందులతో అవసరం లేకుండా జలుబు, దగ్గు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టండిలా!