బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. లైఫ్ లో ఆ తప్పు చేయనంటూ?
TeluguStop.com
నాని( Nani ) హీరోగా నటించిన హిట్ 3 సినిమా( Hit 3 Movie ) మే 1న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను బిజీబిజీగా ఉన్నారు హీరో నాని.
ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ అనేక విషయాలు గురించి చెప్పుకొస్తున్నారు.
అయితే ఈ హిట్ 3 ప్రమోషన్ లో భాగంగానే నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా నాని గతంలో బిగ్ బాస్ సీజన్ 2( Bigg Boss Season 2 )కి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు.
ఆ తర్వాత సీజన్ 2కి హోస్ట్ గా నాని చేయడం విశేషం.సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది.
త్వరలో సీజన్ 9 కూడా ప్రారంభం కాబోతోంది.ఈ టైంలో నాని బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేశారు.మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా మారే ఛాన్స్ ఉందా అని యాంకర్ ప్రశ్నించగా నాని రియాక్ట్ అయ్యారు.
"""/" /
ఈ విషయంపై నాని మాట్లాడుతూ.బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది.
ఇక దాని జోలికి వెళ్ళను.నా జీవితంలో బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్.
బయట ప్రపంచాన్ని నాకు బిగ్ బాస్ డిఫెరెంట్ గా చూపించింది.నేను నార్మల్ గేమ్ అనుకుని బిగ్ బాస్ 2 హోస్ట్ గా వెళ్ళాను.
కానీ దానిలో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పుకొచ్చారు హీరో నాని.
కాగా నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ విజేతగా నిలిచారు.
రన్నరప్ గా సింగర్ గీతా మాధురి నిలిచారు.నాని నటించిన హిట్ 3 చిత్రం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది.
ఈ మూవీలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు.మే 1న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.