‘దసరా’ నుండి ఇంటెన్స్ పోస్టర్.. ఊర మాస్ లుక్ లో నాని!

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టం.

కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.

అందుకే ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఆ వెంటనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించిన కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మెప్పించలేక పోయింది అనే చెప్పాలి.

కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా నాని టీమ్ ను నిరాశ పరిచింది.అయితే ప్రెజెంట్ నాని ఎప్పుడు లేని విధంగా పక్కా మాస్ సినిమా చేస్తున్నాడు.

నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

"""/"/ ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ''దసరా'' సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుంది.రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా నుండి మేకర్స్ ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు.

నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసారు.

"""/"/ ఈ పోస్టర్ తో దసరా సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక ఈ పోస్టర్ తో పాటు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు.

ఈ సినిమా టీజర్ జనవరి 30న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.అలాగే సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?