హిట్3 థియేట్రికల్ బిజినెస్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తే మాత్రమే మూవీ హిట్!
TeluguStop.com
న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన హిట్3 సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.
మే నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
నాని రేంజ్ కు ఈ మొత్తం ఒకింత తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓవర్సీస్, కర్ణాటక,(Overseas, Karnataka) ఇతర ఏరియాల హక్కులు సైతం మంచి రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
పాజిటివ్ టాక్ వస్తే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఈ సినిమాకు సులువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హిట్3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. """/" /
సినిమాలో తన రోల్ కు ప్రాధాన్యత ఉంటుందని ఆమె చెబుతున్నారు.
హిట్3 సినిమా కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
హిట్3 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.
హిట్3 సినిమా టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
"""/" /
హిట్3 సినిమా బిజినెస్(hit3 Movie Business Details) విషయంలో నాని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.
నాని సొంత బ్యానర్ రేంజ్ ను ఈ సినిమా పెంచుతుందో లేదో చూడాల్సి ఉంది.
హిట్3(hit3) సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండనుందని సమాచారం అందుతోంది.హిట్3 సినిమా నాని కెరీర్ కు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
కథల ఎంపికలో నాని వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తుండగా నాని రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది.