సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో చిన్న హీరోల సినిమాలకు కూడా అంతకుమించిన క్రేజ్ అయితే దక్కుతుంది.

అందువల్లే మన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు జాగ్రత్తగా దేశం మొత్తం ఎదురుచూసే రోజులు వచ్చాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక 'సరిపోదా శనివారం' సినిమాతో ( Saripoda Sanivaram )నాని ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

"""/" / దసరా, హాయ్ నాన్న( Dussehra, Hi Nanna ), సరిపోదా శనివారం లాంటి మూడు వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మరికొన్ని సినిమాలను చేయడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన కొంతమంది కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇంద్రగంటి మోహనకృష్ణ ( Indraganti Mohankrishna )డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో జెంటిల్ మెన్, వి( Gentlemen, V ) అనే సినిమాలను చేశాడు.

ఇక వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.ఇక ప్రస్తుతానికి ఇంద్ర గంటి మోహనకృష్ణ ప్రియదర్శి ని హీరోగా పెట్టి ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఆ సినిమా పూర్తయిన వెంటనే నాని తో సినిమా చేయాలని తను ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

గతంలో వీళ్ళ కాంబినేషన్ కి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా గుర్తింపు రావడంతో ఇప్పుడు ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ధోనిని ఎప్పుడు క్షమించను: యువరాజ్ సింగ్ తండ్రి