అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ).

ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.నాని కెరియర్ లోనే ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు నాని ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాలలో కూడా భారీ ఎత్తున ప్రమోషన్లను చేసిన విషయం తెలిసిందే.

మరీ ముఖ్యంగా ముంబయిలో చాలా కష్టపడ్డాడు.నేషనల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు అన్నీ కవర్ చేశాడు.

"""/" / కానీ నాని కష్టానికి విడుదలకు ముందే ఫలితం దక్కలేదు.ముంబయిలో సూర్యాస్ శాటర్ డే కు కేవలం 5 థియేటర్లు మాత్రమే దక్కాయి.

ముంబయిలో ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన మేటర్ కాదిది.ముంబయి వెస్ట్, సౌత్, సెంట్రల్, నవీ ముంబయి, థానె, కల్యాణ్ లాంటి అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా హిందీ వెర్షన్ కు కేవలం 5 థియేటర్లు కేటాయించారు.

పైగా మార్నింగ్ షోలు కూడా లేవు.అంత కష్టపడి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసినప్పటికీ నాని సినిమాకు కేవలం 5 థియేటర్లు మాత్రమే కేటాయించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముంబయి రీజియన్ మొత్తం సూర్యాస్ శాటర్డే సినిమా( SURYA'S SATURDAY)కు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి షోలు మొదలవుతున్నాయి.

ఈ 5 స్క్రీన్స్ లో ఈవినింగ్ షోలున్నాయి.అయితే బుకింగ్స్ మాత్రం జీరో.

"""/" / ముంబయిలో సరిపోదా శనివారం తెలుగు వెర్షన్ కు కేవలం 9 స్క్రీన్స్ మాత్రమే కేటాయించారు.

వీటిలో కూడా ఎక్కడా ఓపెనింగ్స్ లేవు.ఇక తమిళ వెర్షన్ అయితే ఎక్కడా కనిపించలేదు.

సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి హిట్టయితే, ఆటోమేటిగ్గా స్క్రీన్ కౌంట్ పెరుగుతుంది.లేదంటే, ప్రచారానికి పెట్టిన ఖర్చు కూడా వెనక్కురానట్టే.

నాని సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.సినిమా హిట్ అయితే మాత్రం థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అనుకున్నదంతా అయ్యింది.. కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్