నానికి స్పెషల్ గిఫ్ట్ పంపిన చిరు… అవార్డుతో సమానం… చిరు సినిమా పై నాని కామెంట్స్! 

నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం హిట్ 3 (Hit 3) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

నాని ఒకవైపు వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మరోవైపు హీరోగా కూడా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

ఇక త్వరలోనే డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా మే ఒకటో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

"""/" / ఈ క్రమంలోనే ఓ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే నాని నిర్మాణంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి గారితో తనకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు.తరచూ ఆయన ఫోన్ చేసి నాకు విష్ చేస్తూ ఉంటారని తెలిపారు.

జున్ను పుట్టినప్పుడు కూడా ఫోన్ చేసి విష్ చేశారని అలాగే నాకోసం ఒక సైకిల్ గిఫ్టుగా పంపించారని తెలిపారు.

నేను ఆ సైకిల్ ను ఆఫీస్ లో ఒక అవార్డు లాగా చూసుకుంటూ మురిసిపోతానని నాని తెలిపారు.

"""/" / ఇక చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ.ఈ సినిమా కథ చెప్పడానికి నేను శ్రీకాంత్ ఇద్దరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము అయితే మా కోసం ప్రత్యేకంగా చిరంజీవి గారు బజ్జీలు వేయించి తినమని చెప్పారు.

చాలా బాగుంటాయి తినండి అని చెప్పగా నేను మాత్రం ఆయన ముందు తినడానికి కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపారు.

అంతా ఓకే అయ్యాక మేము ఆల్రెడీ రిలీజ్ పోస్టర్ గురించి అనుకున్నాము.శ్రీకాంత్, చిరంజీవి గారి చెయ్యి కలిపి బ్లడ్ లో ముంచింది నేను ఫోటో తీసి పోస్ట్ చేస్తాను అని చెప్పాము.

ఫేక్ బ్లడ్ తెప్పించామని కూడా చెప్పాను. """/" / ఇలా ఈ విషయం చెప్పగానే ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు అంటూ చిరంజీవి గారు తెగ పొగిడేశారు.

ఈ పోస్టర్ సమయంలో శ్రీకాంత్ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు కానీ చిరంజీవి గారు మాత్రం బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారు.

ఆ సమయంలో నేను చిరంజీవి గారితో మాట్లాడుతూ సర్ ఏమనుకోకుండా కాస్త వైట్ షర్ట్ వేసుకుంటారా అని ఆయనని అడగడంతో వెంటనే చిరంజీవి గారు ఓకే ప్రొడ్యూసర్ గారు అంటూ మాట్లాడారు.

ఆయన ఆ మాట అనగానే ఓ నేను ప్రొడ్యూసర్ కదా అని ఫీల్ వచ్చింది.

ప్యారడైజ్ సినిమా రిలీజ్ తర్వాతే చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని నాని తెలిపారు.