దసరాకి బజ్ తెచ్చే పనిలో నాని..!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న సినిమా దసరా.

ఈ సినిమా కోసం నాని చేస్తున్న ప్రమోషన్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నాని కెరీర్ లో రిస్క్ తీసుకుని చేసిన పాత్ర ఇది.అంతేకాదు తన కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా కూడా ఇదే.

సినిమా బాగా రావడంతో తన ప్రమోషన్స్ తో మరింత బజ్ తీసుకు రావాలని ఫిక్స్ అయ్యాడు నాని.

అందుకే దసరా మాస్ ఫోజులతోనే నాని తన ఫ్యాన్ మీట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

దసరా గెటప్ తోనే ఎందుకు అంటే ఈ సినిమాలోని ఈ పాత్ర కొంతకాలం పాటు గుర్తుండిపోతుంది.

అందుకే నాని అలా దసరాలోని తన పాత్ర వేషధారణతోనే నాని ఫ్యాన్స్ మీట్ పెట్టుకున్నాడని అంటున్నారు.

తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ డ్రామాగా వస్తున్న దసరా సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటుందో చూడాలి.

నాని మాత్రం సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.మార్చి 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ రేంజ్ ప్రమోషన్స్ చేస్తే మాత్రం సినిమా హిట్టు కొట్టే ఛాన్స్ ఉన్నట్టే.

నాని తో పాటుగా చిత్రయూనిట్ కూడా సినిమా పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్18, బుధవారం2024