నాని దసరా కోసం మలయాళ స్టార్..!

శ్యామ్ సింగ రాయ్ సినిమాతో కెరియర్ లో ఓ క్రేజీ హిట్ సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగా నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో తెరకెక్కే దసరా సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

నాని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా దసరా మూవీ వస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో నానికి ఈక్వల్ గా మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఒకటి ఉందట.

ఆ సినిమాలో ఓ తెలుగు యువ హీరో నటిస్తాడని వార్తలు వచ్చాయి.కానీ ఫైనల్ గా మళయాళ నటుడు రోషన్ మ్యాథ్యూని సెలెక్ట్ చేశారు.

సినిమాలో నానితో సరి సమానంగా ఈ పాత్ర ఉంటుందని టాక్.మళయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఆరేడు ఏళ్లలోనే చాలా సినిమాలు చేస్తూ నటుడిగా తన సత్తా చాటుతున్న రోషన్ మ్యాథ్యూ మొదటిసారి తెలుగు తెరకు నాని సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.

తెలుగులో ఛాన్స్ రాగానే అతను కూడా వెంటనే ఓకే చెప్పినట్టు టాక్.శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని చాలా ప్రత్యేకంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్.

Coriander : అమ్మ బాబోయ్‌.. కొత్తిమీర‌ను ప‌చ్చిగా తిన‌డం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?