ఏ నమ్మకంతో రూ.40 కోట్లు పెడుతున్నారు సుందరం భయ్యా!
TeluguStop.com
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందుతున్న దసరా సినిమా బడ్జెట్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కు దాదాపుగా 40 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు.
షూటింగ్ లో ఏమైనా ఇబ్బందులు తలెత్తి.మరేదైనా సమస్యలు వస్తే అప్పుడు బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బడ్జెట్ భారీ గా పెరగడం వల్ల నాని మార్కెట్ పరిధిని దాటి పోతుంది.
నాని సూపర్ హిట్ సినిమాలు కూడా ముప్పై నుండి నలబై కోట్ల వసూళ్లు సాధిస్తాయి.
అలాంటిది దసరా సినిమా ఏకంగా 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తే పరిస్థితి ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హీరో గా నాని గత చిత్రం అంటే సుందరానికి యావరేజ్ టాక్ వచ్చింది.
అయినా కూడా కనీసం పదిహేను కోట్ల వసూళ్లను రాబట్టలేక పోయింది అంటూ టాక్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికి ఏమాత్రం సత్తా చాట లేక పోయింది.దసరా సినిమా యొక్క విషయం లో బడ్జెట్ పరిధి దాటిందని.
కాస్త హద్దుల్లో పెట్టడం మంచిది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో దసరా సినిమా గురించి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
కాని దర్శకుడు కొత్త వాడు అయినా కూడా ఈ స్థాయి బడ్జెట్ ఏంటో అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
హీరో నాని గత చిత్రాల మార్కెట్ మరియు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని.
తద్వారా మాత్రమే సినిమా ల యొక్క బడ్జెట్ ను చూసుకుంటే మంచిది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో శ్రీకాంత్ ఓదెల గత ప్రాజెక్ట్ ల గురించి పెద్దగా చర్చ లేదు.
కనుక దసరా సినిమా యొక్క విడుదల సమయంలో ఎలా బజ్ ను క్రియేట్ చేస్తారు అనేది చూడాలి.
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో… మా ప్రేమ పెరుగుతోంది అంటూ?