నాని తెలివైన నిర్ణయం..!

నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.

అ!, హిట్, హిట్ 2 సినిమాలు నిర్మించిన నాని లేటెస్ట్ గా మీట్ క్యూట్ అనే మూవీ కూడా నిర్మించాడు.

నాని సోదరి దీప్తినే ఈ మూవీని డైరెక్ట్ చేశారు.టాలీవుడ్ లో లేడీ డైరక్టర్స్ చాలా అరుదు దీప్తి ఎంట్రీతో ఆమెకు మంచి సపోర్ట్ లభిస్తుంది.

ఇక మీట్ క్యూట్ మూవీని థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు.

సోనీ లివ్ లో ఈ మూవీ రిలీజైంది.అంథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ చూసిన వారంతా కూడా సినిమా డిజిటల్ రిలీజ్ చేసి నాని మంచి పని చేశాడని అంటున్నారు.

ఎందుకంటే ఈ మూవీ థియేటర్ లో అయితే అంత గొప్పగా ఆదరణ పొందేది కాదని ఆడియన్స్ టాక్.

అంతేకాదు ఐదు కథలు నడిపించిన తీరు బాగున్నా సో నరేషన్ సినిమాకు మైనస్ అని టాక్.

సో అందుకే నిర్మాతగా నాని ఇవన్ని ముందే ఆలోచించి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

నాని నిర్మాతగా కూడా చాలా క్లవర్ డెశిషన్స్ తీసుకుంటున్నాడని అర్ధమవుతుంది.

Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు