వరుస సినిమాలతో బిజీగా మారిన నాని… ఇప్పుడైనా సక్సెస్ వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని.( Nani ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి.

ఇక మన పక్కింటి కుర్రాడు ఎలా అయితే మాట్లాడతాడో అలాంటి ఒక న్యాచురల్ యాక్టింగ్ తో సక్సెస్ లను అందుకుంటూ వస్తున్న నటుడు కూడా నానే కావడం విశేషం.

ఇక మొత్తానికైతే నాని చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ను సాధిస్తూ వస్తున్నాయి.

"""/" / ప్రస్తుతం నాని వరుస సినిమాలను కమిట్ అవుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పటికే బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న నాని తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేస్తున్న 'సరిపోదా శనివారం'( Saripodhaa Sanivaaram ) సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉంది.

చివరి షెడ్యూల్ తో ఈ సినిమాకి ప్యాకప్ చెప్పబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ చేసిన బలగం వేణు( Balagam Venu ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

"""/" / ఇక ఇలాంటి క్రమంలోనే సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో కూడా నాని ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఈ సినిమా మీద పలు రకాల రూమర్లు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం సజావుగా సాగుతుందని సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది.

ఇక సుజిత్ ఇప్పుడు ఓ జి సినిమాలో మళ్లీ బిజీ కానున్న నేపథ్యంలో నాని ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలు అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో అటు నాని, ఇటు సుజీత్ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజం చెబితే చస్తారు…ఆ భాద మీకు తెలియదు పూనమ్ సంచలన వ్యాఖ్యలు!