అంటే సుందరానికి సినిమా నిర్మాతల ఆలోచనలను పూర్తిగా మార్చేసిందా?

ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలు కనీసం థియేటర్లలో నెల రోజులు కూడా ఆడకముందే ఓటీటీ లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

అందులో రెండు పెద్ద సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమాలే ఉండటం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్ తో పుష్ప, మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలతో మరొక తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తమ బ్యానర్ ఖాతాలో వేసుకున్నారు.

అంతేకాకుండా ఈ రెండు సినిమాలకు గాను మైత్రి మూవీ మేకర్స్ పాలసీ అమౌంట్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ తాజాగా నిర్మించిన సినిమా అంటే సుందరానికి.ఇందులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా జూన్ 10న థియేటర్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ సొంతం చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

"""/"/ దీన్ని బట్టి చూస్తుంటే నాని సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై స్పందించిన నాని చిత్రబృందం ఓటీటీ తో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపారు.

అంతే కాకుండా అంత తక్కువ సమయంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వదు అని తెలిపారు.

దీన్ని బట్టి చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అంటే సుందరానికి ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో తమ ఆలోచనలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ లో విడుదల అవ్వడానికి ఓటీటీ లో విడుదల అవడానికి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీడియో: హుండీ విరాళాలు లెక్కపెడుతూనే నోట్ల కట్టలు కాజేశారుగా..