సుందరం ప్రీ రిలీజ్ వేడుక.. చీఫ్‌ గెస్ట్‌ ఎవరు రాబోతున్నారు?

నాచురల్‌ స్టార్‌ నాని హీరో గా నజ్రియా హీరోయిన్‌ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

జూన్ 10 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి.

భారీ అంచనాల నడుమ రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలకు ఇటీవలే క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఖచ్చితంగా సినిమాను జూన్ 10వ తారీకున విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాం అంటూ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

హీరో నాని మరియు హీరోయిన్ నజ్రియాలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

వారిద్దరు కూడా సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి తో సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు.

సినిమా లో నాని పాత్ర పై చాలా ఆసక్తి వ్యక్తం అవుతోంది.సినిమా విడుదల నేపథ్యం లో ప్రీ రిలీజ్ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు ప్రీ రిలీజ్ వేడుక లో స్పెషల్‌ గెస్ట్‌ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదే సమయంలో ఒక యంగ్‌ హీరో కూడా నానికి సన్నిహితుడు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటాడని తెలుస్తోంది.

జూన్‌ 4వ తారీకు లేదా 5 వ తారీకున ప్రీ రిలీజ్ వేడుక దాదాపు గా కన్ఫర్మ్‌ అవ్వబోతుంది.

ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని మరింతగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

అంటే సుందరాని కి తో నాని మరో విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమా విడుదల విషయం లో వరుసగా సినిమా లు ఉన్నా కూడా అంటే సుందరానికి సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇదేందయ్యా ఇది.. పొలిటికల్ సైన్స్ డిగ్రీతో వైద్యుడు ఎలా అయ్యాడబ్బా?