నాని టీమ్ ఇబ్బందులు మాములుగా లేవుగా.. మరీ అంత మందితో అంటే కష్టమే!

న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.

అయితే నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

గత ఏడాది దసరా పండుగ సందర్భంగా నాని కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు 'దసరా' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.

"""/"/ నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో మరొక విభిన్న పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తుంది.

నాని లుక్ కూడా కొత్తగా కనిపిస్తుంది.ప్రెసెంట్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ పెద్ద పల్లి జిల్లాలోని గోదావరి ఖని లో జరుగుతుంది.

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ లో నాని, కీర్తి సురేష్ లపై ఒక పాట షూట్ జరుగు తుందని తెలుస్తుంది.

ఈ పాట కోసం టీమ్ అంతా చాలా కష్టపడుతున్నారట.మండే ఎండల్లో నాని, కీర్తి మధ్య రొమాంటిక్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు.

ఈ పాటలో కోసం 500 మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నారట. """/"/ అయితే ఈ పాట షూట్ వల్ల టీమ్ అంతా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే షూటింగ్ జరిగే ప్రాంతం చాలా చిన్నది కావడంతో అక్కడ 500 మందికి వసతి ఏర్పాటు చేయడం కష్టంగా ఉందట.

ఆ చిన్న ఊరులో అంతమందిని ఉంచేందుకు అతిథి గృహాలు కానీ హోటల్స్ కానీ లేకపోవడంతో వారిని ప్రభుత్వ అతిథి గృహాలకు, అలాగే కల్యాణ మండపాల్లో కొంతమందిని, ఇతర ఖాళీ స్థలాల్లో టెంట్ లు వేసి వారిని అక్కడ ఉంచారట.

ఇలా చిన్న ఊరులో వారికీ సౌకర్యాలు నిర్వహించడం కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది.

మొత్తానికి ఎంత కష్టమైన కూడా టీమ్ అంతా కూడా భగభగ మండే ఎండలో ఈ పాటను పూర్తి చేస్తున్నారు.