‘దసరా’ కోసం కీర్తి సురేష్ చాలా ఎక్కువగానే ఇచ్చిందట.. ఎందుకో తెలుసా!
TeluguStop.com
నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా చిత్రం ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
నెల రోజుల నుండి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు.అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఇప్పటి వరకు కీర్తి సురేష్ మరియు నాని యొక్క పాత్రల గురించి ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మాత్రం యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఇద్దరు కూడా మాస్ లుక్ లో కనిపించబోతున్నారని క్లారిటీ అయితే ఉంది.ఇక సినిమా పై ఇద్దరికీ కూడా చాలా నమ్మకం గా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.
"""/" /
ముఖ్యంగా కీర్తి సురేష్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుందట.
ఈ సినిమా విడుదలయితేనే తదుపరి సినిమా కు ఓకే చెప్పాలని భావిస్తుంది.సినిమా కు సక్సెస్ టాక్ సొంతమైతే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయవచ్చు అన్న ఉద్దేశం తో కీర్తి సురేష్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా కోసం కాస్త ఎక్కువగానే కీర్తి సురేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్పిందట.
ఆమె సాధారణం గా వారం లేదా రెండు వారాలు మాత్రమే సినిమా ప్రమోషన్ కి కేటాయిస్తుంది.
"""/" /కానీ దసరా సినిమా కోసం ఏకంగా నెల రోజుల పాటు సమయాన్ని కేటాయించడం జరిగిందట.
దసరా సినిమా ను సాధ్యమైనంత వరకు ఎక్కువగా తెలివి తో పాటు ఇతర భాషల్లో ప్రమోట్ చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
అందుకోసమే కీర్తి సురేష్ ఎక్కువ డేట్ లను ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి కీర్తి సురేష్ చాలానే కష్టపడుతోంది.
మరి ఆమె కష్టానికి ఫలితంగా దసరా సినిమా సక్సెస్ అయ్యేనా చూడాలి.
ప్రియదర్శి కోర్ట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?