Dasara : బన్నీ సినిమాను కాపీ కొట్టి నాని దసరా తీశారా.. రెండు సినిమాల మధ్య పోలికలు ఇవేనంటూ?
TeluguStop.com
టాలీవుడ్ హీరోస్ నాచురల్ స్టార్ నాని అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఇద్దరు హీరోలను పోల్చుకుంటే ఐకాన్ అల్లు అర్జున్ కి భారీగా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.
ఇకపోతే అల్లు అర్జున్( Allu Arjun ) విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఈ మూవీ వచ్చే ఏడాది అనగా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.
అలాగే నాని కూడా చాలా కూల్ అండ్ క్లాసిక్ సెంటిమెంటల్ స్టోర్ నాన్నతో అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
"""/" /
కాగా గతంలో ఒకే కథతో వీళ్లిద్దరూ వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆ సినిమా మరేదో కాదు అల్లు అర్జున్ కెరియర్ లో నటించిన సీక్వెల్ సినిమా ఆర్య 2నాచురల్ స్టార్ నాని కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో తెరకెక్కిన దసరా.
ఆర్య 2,దసరా సినిమాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.స్టోరీ మొత్తం ఒక్కటే.