Jettymovie : ఓటీటీలో దూసుకుపోతున్న నందితా శ్వేత జెట్టి మూవీ?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నందితా శ్వేతా( Nandita Swetha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నందిత శ్వేతా ప్రస్తుతం బుల్లితెరపై ఢీ,జబర్దస్త్ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

అందులో భాగంగానే తాజాగా నందితా శ్వేత నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అందులో ఒక సినిమా థియేటర్లో విడుదల కాగా మరో సినిమా ఓటీటీలో విడుదల అయింది.

నందితా హీరోయిన్ గా నటించిన జెట్టి సినిమా నేడు అనగా శుక్రవారం ఆహా ఓటీటీలో విడుదల అయింది.

"""/" / అలాగే గత శుక్రవారం విడుదల అయిన మంగళవారం సినిమాలో నందితా శ్వేత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.

ఇలా ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి అభిమానులకు డబ్బులు ధమాకా ఇచ్చింది నందితా శ్వేత.

ఇకపోతే అందులో జెట్టి సినిమా విషయానికి వస్తే.ఈ మూవీ మ‌త్య్స‌కారుల జీవితాల నేప‌థ్యంలో జెట్టి రూపొందింది.

తండ్రీ కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కాగా జెట్టి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త్రివిక్ర‌మ్‌, బాల‌కృష్ణ‌ తో పాటు ప‌లువురు స్టార్స్ కూడా పాల్గొన్నారు.

"""/" / కాగా గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో రిలీజైన ఈ సినిమా ఏడాది త‌ర్వాత ఓటీటీ లోకి రావ‌డం గ‌మ‌నార్హం.

కాగా ఈ సినిమాలో మానినేని కృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ జెట్టి సినిమా విడుదల అయ్యి ఏడాది అయిన కూడా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు.

ప్రస్తుతం జట్టి సినిమా ఓటీటీ లో రాణిస్తూ దూసుకుపోతోంది.ఇక ముందు ముందు ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.

ప్రస్తుతం నందితా శ్వేతా చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.