నందిని రాయ్‌ పరువు తీసిన బిగ్‌బాస్‌.. వెక్కివెక్కి ఏడ్చేసింది

తెలుగు బిగ్‌బాస్‌లో ఏడుపులు, నవ్వులు చాలా కామన్‌గా కనిపిస్తాయి.తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సభ్యుల గురించి నిర్వాహకులు కొన్ని వ్యాఖ్యలను రాసి పంపడం జరిగింది.

ఆ వ్యాఖ్యలు ఎవరి గురించి అనేది ఇంటి సభ్యులు గుర్తు పడితే వారికి ఇష్టం అయిన ఫుడ్‌ను పంపిస్తారు.

ఇంట్లో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వ్యాఖ్య వచ్చింది.అందరితో పాటు నందిని రాయ్‌కి ‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అంటూ వ్యాఖ్య వచ్చింది.

ఆ సమయంలో అంతా కూడా అది నందిని రాయ్‌ గురించి అంటూ చెప్పారు.

ఇంటి సభ్యులు చెప్పినట్లుగానే నందిని రాయ్‌ వ్యాఖ్య నిజం అవ్వడంతో ఆమెకు ఇష్టం అయిన ఫుడ్‌ను బిగ్‌బాస్‌ ఇచ్చాడు.

ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న అందరికి మంచి వ్యాఖ్యలు రాగా, నందిని రాయ్‌కి మాత్రం కాస్త కఠువు వ్యాఖ్య వచ్చింది అంటూ సాదారణ ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నందిని రాయ్‌ కూడా తన గురించి బిగ్‌బాస్‌ చేసిన వ్యాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

చాలా సేపు ఏడ్చిన నందిని రాయ్‌ బిగ్‌బాస్‌ ఐ హేట్‌ యు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇంటి సభ్యులు అంతా కూడా నందినిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

అయినా కూడా నందిని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.తనను బిగ్‌బాస్‌ తీవ్రంగా అవమానించాడు అంటూ నందిని ఆవేదన వ్యక్తం చేసింది.

బిగ్‌బాస్‌ ఐ హేట్‌ యు అంటూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లి పోయింది.

నందిని రాయ్‌ విషయంలో బిగ్‌బాస్‌ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ గురించి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

నందిని రాయ్‌ అభిమానులు ఆమెపై బిగ్‌బాస్‌ చేసిన విమర్శకు కోపంతో ఉన్నారు.అందరికి మంచి వ్యాఖ్యలు ఇచ్చిన బిగ్‌బాస్‌ ఎందుకు నందిని రాయ్‌కి ఇలాంటి వ్యాఖ్య ఇచ్చాడు అంటూ కొందరు అంటున్నారు.

అయితే నందినికి కరెక్ట్‌ వ్యాఖ్య వచ్చిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ.. నెటిజన్ల విమర్శలపై కీర్తిభట్ రియాక్షన్ ఇదే!