నందిని రెడ్డి నెక్స్ట్ సినిమా హీరో ఎవరంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లలో చాలా మంది డైరెక్టర్లు మగవాళ్ళే ఉన్నారు.
ఆడవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి.ఒకప్పుడు విజయ నిర్మల( Vijaya Nirmala ) గారు లేడీ డైరెక్టర్గా తెలుగు లో సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నారు.
ఇక ఆమె తర్వాత ఇండస్ట్రీ లో లేడి డైరెక్టర్( Lady Director ) గా మంచి గుర్తింపు పొందిన వాళ్లలో నందిని రెడ్డి( Nandini Reddy ) ఒకరు ఈమె కృష్ణ వంశీ దగ్గర చాలా సినిమాలకి దర్శకత్వ విభాగం లో పనిచేసి ఆ తర్వాత నాని ని హీరో గా పెట్టీ అలా మొదలైంది అనే సినిమా చేశారు.
ఈ సినిమా మంచి హిట్ అవ్వడం తో ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ లో ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఒకటి, రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.
"""/" /
ఇక దాంతో ఆమె సమంతని మెయిన్ లీడ్ గా పెట్టీ తీసిన ఓ బేబీ సినిమా( Oh Baby Movie ) మంచి విజయం సాధించింది ఈ సినిమాతో ఆమె ఖాతాలోకి మరో సక్సెస్ చేరింది.
ఇక ఈమె మంచి సక్సెస్ తీసింది అని అనుకునే లోపే సంతోష్ శోభన్ తో చేసిన అన్ని మంచి శకునములే సినిమా డిజాస్టర్ అయింది ఇక దానితో ప్రస్తుతం ఆమె స్టోరీ రైటింగ్ లో బిజీ గా ఉంది.
నిజానికి ఆమె నాగ చైతన్య తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు నాగ చైతన్య బిజీ గా ఉండటం ఒకటి అయితే ఆమె ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉంది కాబట్టి నాగ చైతన్య( Naga Chaitanya ) ఫ్రీ అయ్యేలోపు ఈ కథ ఫైనల్ చేసి నాగ చైతన్య కి వినిపించాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
"""/" /
ఇక ఈ సినిమా తో మళ్ళీ ఒక.మంచి హిట్ కొట్టాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది ఇక ఇప్పుడు కూడా ఒక మంచి లవ్ స్టోరీ తోనే మన ముందుకు వస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈమె లవ్ స్టోరీస్ ని చాలా అందంగా అద్భుతం గా తీయగలదు అనే పేరు సంపాదించుకుంది కానీ ఓన్లీ లవ్ స్టోరీస్( Love Stories ) ని డైరెక్ట్ గా చెప్పకుండా అందులో కామెడీ జోడించి చెప్పడం లో ఆమె ఒక సూపర్ డైరెక్టర్ అనే చెప్పాలి.
ఇక దీన్ని బట్టి చూస్తే ఆమె నెక్స్ట్ మూవీ నాగ చైతన్య తోనే ఉండబోతున్నట్లు గా తెలుస్తుంది.
నవంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ.. వామ్మో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదా?